84-ST- CURRENT AFFAIRS DEC 1 – 15

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests-Rs.800) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

ఈ-మెయిల్ ద్వారా రైట్ ఛాయిస్ గ్రాండ్ టెస్ట్ లు (6 వేల ప్రశ్నలతో)

http://telanganaexams.com/e-mail-gts/

1. కిన్నెర బాలమ్మ గురించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది
1) పన్నెండు మెట్ల కిన్నెర గాయని డక్కలి బాలమ్మ 2018 డిసెంబర్ 8న చనిపోయింది
2) వికారాబాద్ జిల్లా తాండూ దగ్గర్లోని మంబాపూర్ బాలమ్మ స్వగ్రామం
3) పది వీరగాథలను పాడుతూ, పన్నెండు మెట్ల కిన్నెర వాయించడం బాలమ్మ ప్రత్యేకత
2. టీ రేషన్ యాప్ నకు సంబంధించి ఈ ప్రకటనల్లో తప్పుగా చెప్పినది
ఎ) టీరేషన్ యాప్ ను రేషన్ షాప్ డీలర్ల కోసమే తయారు చేశారు
బి) రేషన్ లావాదేవీలను సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు తయారు చేశారు
సి) టీరేషన్ యాప్ నకు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ-గవర్నెన్స్ అవార్డును అందించారు
డి) ప్రభుత్వ సేవలు, సరుకుల సరఫరా నుంచి పంపిణీ వరకూ జరిగే అన్ని వివరాలు ఈ యాప్ తో తెలుసుకోవచ్చు
3. జీశాట్ - 11 ప్రయోగానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది
ఎ) సమాచార ఉపగ్రహం జీశాట్ 11ను ఇస్రో 2018 డిసెంబర్ 4న విజయవంతంగా ప్రయోగించింది
బి) దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు
సి) 5,854 కిలోలు ఉన్న ఈ ఉపగ్రహం ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ అన్నింటిలోకి బరువైనది
డి) జీశాట్ 11 దాదాపు 25యేళ్ళ పాటు సేవలు అందిస్తుంది
4. 2018 డిసెంబర్ లో వార్తల్లోకి వచ్చినవారు - వారి రంగాలు జతపరచండి
1) వినేశ్ ఫొగట్
2) డక్కలి బాలమ్మ
3) కొలకలూరి ఇనాక్
4) కృష్ణమూర్తి సుబ్రమణియన్

ఎ) కేంద్ర ఆర్థిక సలహాదారు
బి) కిన్నెర గాయని
సి) సాహిత్యం
డి) రెజ్లింగ్
5. అభినవ్ బింద్రా గురించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది
1) ఒలింపిక్స్ వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ షూటర్
2) 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా స్వర్ణం గెలచుకున్నాడు
3) అభినవ్ బింద్రాకి అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య బ్లూ క్రాస్ పురస్కారం ప్రకటించింది
6. కందమల్ హల్దీ గురించి ఈ కింది ప్రకటనల్లో తప్పు ఏది
7. ఈ కింది ప్రకటనల్లో సరికానిది ఏది
8. 2018 డిసెంబర్ 11న కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల వివరాలను జతపరచండి
1) తెలంగాణ
2) ఛత్తీస్ గఢ్
3) మధ్యప్రదేశ్
4) మిజోరం
5) రాజస్థాన్

ఎ) 40
బి) 200
సి) 90
డి) 230
ఇ) 119
9. 2018 డిసెంబర్ లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు - సంబంధం ఉన్న అంశాలు జతపరచండి
1) లింగమూర్తి
2) క్యాట్రియోనో ఎలైసా గ్రే
3) విక్రమ సింఘే
4) మలాలా యూసఫ్ జాయ్

ఎ) గ్లైట్స్ మ్యాన్
బి) మిస్ యూనివర్స్ (2018)
సి) శ్రీలంక ప్రధాని
డి) సాలగ్రామం (ఆత్మకథ)
10. అమితవ్ ఘోష్ కు సంబంధించి ఈ కింది అంశాల్లో ఏవి తప్పు
ఎ) ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్ కు 54 వ జ్ఞాన్ పీఠ్ పురస్కారం లభించింది
బి) ది గ్రేట్ డిరేంజ్ మెంట్ నవలకు ఈ అవార్డు దక్కింది
సి) ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్, సీ ఆఫ్ పాపీస్ తదితర రచనలు రాశారు
డి) అమితవ్ ఘోష్ కి పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి
11. ఏ రెండు దేశాల మధ్య ఇంద్ర పేరుతో సంయుక్త విన్యాసాలు డిసెంబర్ 9 నుంచి 16 వరకూ విశాఖలో జరిగాయి.
12. 14వ హాకీ ప్రపంచకప్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
ఎ) ఈ టైటిల్ ను బెల్జియం గెలుచుకుంది
బి) 2018 డిసెంబర్ 16న భువనేశ్వర్ లోని కలింగ్ గ్రౌండ్ లో నెదర్లాండ్స్ ని ఓడించిన మొదటిసారి బెల్జియం గెలుచుకుంది
సి) హాకీ ప్రపంచ కప్ లో భారత్ మూడో స్థానంలో నిలిచింది
డి) భారత్ లో జరిగిన ఈ టోర్నీకి మస్కట్ టర్టిల్ ఓలీ ( అంతరించిపోయే దశలో ఉన్న ఓలివ్ రిడ్లే తాబేళ్ళకు గుర్తుగా )
13. వాతావరణ మార్పుల సూచీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
1) పోలెండ్ లోని కటోవైస్ నగరంలో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సు 2018 డిసెంబర్ 13న జరిగింది
2) 2018 గణాంకాలతో రూపొందించిన వాతావరణ మార్పు నిర్వహణ సూచీ2019లో స్వీడన్ మొదటి స్థానంలో నిలచింది
3) ఈ సూచీలో భారత్ కు 2 వ ర్యాంక్ వచ్చింది
4) ఈ సూచీని న్యూక్లైమేట్ ఇనిస్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్ వర్క్, జర్మన్ వాచ్ సంస్థలు రూపొందించాయి.
14. 2018 డిసెంబర్ లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు - అంశాలు జతపరచండి
1) శక్తికాంత దాస్
2) అరుంధతీ భట్టాచార్య
3) జమాల్ ఖషోగ్గీ
4) అమితవ్ ఘోష్

ఎ) జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత
బి) స్విఫ్ట్ ఇండియా ఛైర్మన్
సి) వాల్ స్ట్రీట్ పత్రిక జర్నలిస్ట్
డి) ఆర్బీఐ గవర్నర్
15. మన దేశంలో త్రివిధ దళాల్లో మెరికలతో మెరుపు దళాలను తీర్చి దిద్దారు. వాళ్ళ పేర్లకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి
1) సైన్యం - పారాచూట్ దళం

2) నౌకదళం - మెరీన్ కమాండోలు (మార్కోస్)

3) వైమానిక దళం - గరుడ్
16. 2018 డిసెంబర్ లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది
ఎ) ఛత్తీస్ గఢ్ లో 68 స్థానాల గెలుపుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
బి) రాజస్థాన్ లో 100 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
సి) మిజోరాంలఓ అధికారం చేపట్టిన కూటమి - మిజో నేషనల్ ఫ్రంట్
డి) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు టీఆర్ఎస్ కి దక్కాయి
17. 2018 డిసెంబర్ లో దేశంలోని 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ కింది వాటిల్లో లేనివి ఏవి
1) గువాహటి
2) లఖ్ నవూ
3) శంషాబాద్
4) ముంబై
5) తిరువనంతపురం
6) అహ్మదాబాద్
7) జయపూర్
8) మంగళూరు
18. 2018 డిసెంబర్ 19న ఏపీ- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న ఉపగ్రహ వాహక నౌక పేరేంటి ?
19. మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రంతో ఎన్ని రూపాయల నాణేన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
20. లోక్ మత్ గ్రూపు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల్లో భాగంగా లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ ఎవరికి ప్రకటించారు ?
21. BWF ప్రపంచ టూర్ టైటిల్ కు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1) తెలుగు తేజం పీవీ సింధు గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి భారత క్రీడాకారిణి
2) ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ గెలిచిన సింధుకి భారత్ బ్యాడ్మింటన్ సంఘం రూ.10లక్షలు నజరానా ప్రకటించింది
22. వార్తల్లో ప్రదేశాలు - అంశాలు జతపరచండి
1) సూర్యలంక
2) కన్నూర్
3) హైదరాబాద్
4) లాస్ ఏంజెలిస్

ఎ) హైస్పీడ్ భూగర్భ సొరంగ మార్గం నిర్మాణం
బి) జాతీయ పుస్తక ప్రదర్శన
సి) ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమైంది
డి) ఆకాష్, స్పైడర్ OSA-AK-M, ఇగ్లా క్షిపణి పరీక్షలు జరిగాయి
23. డిసెంబర్ 2018 అవార్డులు - గ్రహీతలు
1) జి.వెంకట సుబ్బయ్య
2) మనిక బత్ర
3) డాక్టర్ గాంధీ పీసీ కాజా
4) సాధ్వి నిరంజన్

ఎ) చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్
బి) వర్ధమాన టీటీ స్టార్
సి) డాక్టర్ పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్
డి) సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్
24. గ్రంథాలు - రచయితలు
1) ది రిపబ్లిక్ ఎథిక్, లోక్ తంత్ర కీ స్వర్
2) ఆఫ్ కౌన్సిల్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ - జైట్లీ ఎకానమీ
3) ఎగెనెస్ట్ ఔట్రేజ్
4) ఇండియా అన్ మేడ్ : హౌ ది మోదీ గవర్నమెంట్ బ్రోక్ ది ఎకనామీ

ఎ) అరవింద్ సుబ్రమణియన్
బి) ప్రియాంక గాంధీ
సి) యశ్వంత్ సిన్హా
డి) రామ్ నాథ్ కోవింద్ (ప్రసంగాల సంకలనాలు)
25. ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
ఎ) దేశంలో గాలి కాలుష్యంతో జరుగుతున్న మరణాలు, ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆయుర్దాయం క్షీణతపై ICMR, PHFI, IHME సంస్థలు నిర్వహించిన సర్వే వివరాలు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ లో పత్రిలో ప్రచురితం అయ్యాయి
బి) కిందటేడాది చోటు చేసుకున్న ప్రతి 8 మరణాల్లో ఒకటి గాలి కాలుష్యం వల్ల జరిగింది
సి) ప్రపంచ జనాభాలో భారత్ వాటా 18శాతం, ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో భారత్ వాటా 26శాతం
డి) గాలి కాలుష్యం వల్ల అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 2.6 లక్షల మంది చనిపోయారు