Home
Education
Jobs
6 Months Tests
Log In
SIGroup2T
SIGroup2T
Latest Updates
Current Affairs & G.K. Test
Education
Jobs
FBO Telugu
FBO English
15-ST- ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల కమిషన్
1.
కమిటీలు - చర్చించిన అంశాలు జతపరచండి
1) దినేష్ గోస్వామి కమిటీ (1990)
2) వోహ్రా కమిటీ (1993)
3) ఇంద్రజిత్ గుప్తా కమిటీ (1998)
4) తంఖా కమిటీ (2010)
ఎ) ఎన్నికల చట్టాలు
బి) ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ నిధులు
సి) నేరాలు - రాజకీయ సంబంధాలు
డి) ఎన్నికల సంస్కరణలు
1డి, 2బి, 3సి, 4ఎ
1బి, 2డి, 3సి, 4ఎ
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2సి, 3బి, 4ఎ
2.
ఎన్నికల కమిషన్ కు సంబంధించి క్వాసీ జ్యుడీషియల్ పవర్స్ అంటే ఏంటి ?
పార్టీల మధ్య వివాదాలను పరిష్కరించడం
పార్టీలపై ఆధిపత్యం చెలాయించడం
రాజకీయ పార్టీలకు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఇవ్వడం
పార్టీలకు సింబల్స్ కేటాయించడం
3.
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్లు - వారి కాలానికి సంబంధించిన ప్రత్యేకతలు జతపరచండి
1) జె.ఎం.లింగ్డో
2) కె.వి.కె సుందరం
3) టి.ఎన్ శేషన్
4) నాగేంద్ర సింగ్
ఎ) అతి తక్కువ కాలం CEC
బి) రామన్ మెగసెసే అవార్డు గ్రహీత
సి) ఎన్నికల సంస్కరణలు
డి) ఎక్కువ కాలం CEC
1బి, 2డి, 3సి, 4ఎ
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2బి, 3సి, 4ఎ
1సి, 2ఎ, 3డి, 4బి
4.
ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే
1) రాష్ట్ర శాసన సభలో కనీసం రెండు సీట్లు సాధించాలి
2) రాష్ట్ర శాసన సభ లేదా లోక్ సభ సాధారణ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6శాతం ఓట్లు రావాలి
3) రాష్ట్ర శాసన సభలో 3శాతం సీట్లు లేదా కనీసం 3 సీట్లు ( ఏదీ ఎక్కువైతే అది)
3, 1 లేదా 2
1, 2 లేదా 3
2, 3 లేదా 1
పై మూడింటిలో ఏదైనా ఒకటి
5.
రాజకీయ పార్టీలు - ఎన్నికల గుర్తులు జతపరచండి
1) సమాజ్ వాదీ పార్టీ
2) పట్టలి మక్కల్ కచ్చి
3) మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన
4) అసోం గణపరిషత్
ఎ) సైకిల్
బి) మామిడి పండు
సి) రైల్ ఇంజన్
డి) ఏనుగు
1ఎ, 2డి, 3బి, 4సి
1ఎ, 2బి, 3సి, 4డి
1ఎ, 2బి, 3డి, 4సి
1డి, 2సి, 3బి, 4ఎ
6.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఈ కింది ఏయే సందర్బాల్లో పార్లమెంట్, శాసన సభ సభ్యులు అనర్హులుగా గుర్తించబడతారు
1) రెండేళ్ళు తక్కువ కాకుండా శిక్ష పడినవారు
2) వరకట్న నిషేధం, ఆహార కల్తీ లాంటి నేరాల్లో 6యేళ్ళు కంటే తక్కువ కాకుండా శిక్ష పడితే
3) అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం కింద నేరం రుజువైన వారు
4) అవినీతి కింద తొలగించబడిన ప్రభుత్వ ఉద్యోగాలు 5యేళ్ళ వరకూ అనర్హులు
5) మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికపై ఓట్లు అడిగినప్పుడు
1,2,5 మాత్రమే
అన్నీ కరెక్ట్
1,2,3,4 మాత్రమే
1,2,3 మాత్రమే
7.
ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకి అభిప్రాయబేధాలు వస్తాయి... అప్పుడు
రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు
కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కోరుతారు
CEC అభిప్రాయమే ఫైనల్
కమిషన్ లో మెజారిటీ నిర్ణయాన్ని బట్టి
8.
01) ఈ కింది వాటిని జతపరచండి
1) ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1950
2) ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951
3) ఎన్నికల నిర్వహణ, నిబంధనలు - 1961
4) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం -1952
ఎ) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, నియోజక గణం, షరతులు
బి) ఎన్నికల నిర్వహణ, నిబంధనలు
సి) ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గుర్తింపు
డి) ఓటర్లు, అర్హతలు, ఓటర్ల జాబితా తయారీ
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2సి, 3బి, 4ఎ
1డి, 2బి, 3ఎ, 4సి
1ఎ, 2డి, 3బి, 4సి
9.
ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
అన్నీ కరెక్ట్
1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ గా మార్చింది
1993లో పి.వి. ప్రభుత్వం తిరిగి త్రిసభ్య కమిషన్ మార్చింది
1990లో వీపీ సింగ్ ప్రభుత్వం తిరిగి ఏక సభ్య కమిషన్ గా మార్చింది
10.
ఈ కింది ఏ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు
320
326
324
325
11.
పెద్ద రాష్ట్రాల్లోని లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యయపరిమితి ఎంత
రూ.70 లక్షలు - 28 లక్షలు
రూ.75 లక్షలు - 25 లక్షలు
రూ.60 లక్షలు - 30 లక్షలు
రూ.74 లక్షలు - 30 లక్షలు
12.
రాష్ట్ర ఎన్నికల సంఘంనకు సంబంధించి తప్పుగా పేర్కొన్న స్టేట్ మెంట్ ఏది
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు
243(కె) మరియు 243 (Z-A) అధికరణలతో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు
1992లో రాజ్యాంగంలో చేర్చిన 73, 74 రాజ్యాంగ సవరణలను అనుసరించి రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 62 యేళ్ళు
13.
ఎన్నికల తేదీలు ప్రకటించడం లాంటి అంశాలు పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?
ఎస్.ఆర్ బొమ్మయ్ వర్సెస్ ఎక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఏదీ కాదు
టీ.ఎన్.శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
మక్కల్ శక్తి ఖచ్చిప్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
14.
జతపరచండి
1) ఆర్టికల్ 324
2) ఆర్టికల్ 329
3) ఆర్టికల్ 243(కె)
4) ఆర్టికల్ 326
ఎ) సార్వత్రిక వయోజన ఓటు హక్కు
బి) రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు
సి) ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యం నిషేధం
డి) స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు
1ఎ, 2డి, 3సి, 4బి
1సి, 2బి, 3డి, 4ఎ
1బి, 2సి, 3డి, 4ఎ
1డి, 2సి, 3బి, 4ఎ
15.
ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఏ స్టేట్ మెంట్స్ కరెక్ట్
ఎ) జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ సూచనలతో స్వతంత్ర్య అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా వేయకుండా యధావిధిగా నిర్వహిస్తున్నారు
బి) 1996 నుంచి ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను నియమిస్తోంది
సి) ఎన్నికల్లో EVM లను ఉపయోగించాలని సూచించింది దినేష్ గోస్వామి కమిటీ
డి) ఎన్నికల్లో డిపాజిట్లు పెట్టడం ద్వారా ఆషామాషీ అభ్యర్థుల్ని తగ్గించవచ్చని సూచించింది జీవన్ రెడ్డి కమిషన్
ఎ మరియు డి మాత్రమే
ఎ,బి,సి
ఎ,బి,సి,డి
బి,సి,డి
16.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది తప్పు
దేశంలో ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో ముగ్గురు రీజినల్ కమిషనర్లు ఉన్నారు
వీరి పదవీ కాలం 6యేళ్ళు లేదా 65 సంవత్సరాలు
వీరి జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినల్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు
17.
ప్రధాన ఎన్నికల కమిషనర్లను వారి పదవీ కాలం ప్రకారం క్రమపద్దతిలో రాయండి
1) టి.ఎన్ శేషన్
2) సుకుమార్ సేన్
3) బి.బి. టాండన్
4) నవీన్ చావ్లా
5) వి.ఎస్.రమాదేవి
5,4,3,2,1
2,5,1,3,4
1,2,3,4,5
2,3,1,5,4
18.
ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్
1) పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో నోటిఫికేషన్ జారీ చేస్తారు
2) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేస్తారు
3) ఈ రెండు నోటిఫికేషన్లను కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది
2,3 మాత్రమే కరెక్ట్
1,2,3 కరెక్ట్
1,2 మాత్రమే కరెక్ట్
3 మాత్రమే కరెక్ట్
19.
ఏ స్టేట్ మెంట్ తప్పు
పారిశ్రామిక వర్గాలు, కంపెనీలు రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే పద్దతి నిషేధించాలని సూచించిన కమిటీ - కె.సంతానం కమిటీ
రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం సంస్థాగత ఎన్నికలు జరపాలని ఆదేశించిన ఎన్నికల అధికారి టి.ఎన్ శేషన్
సంస్థాగత ఎన్నికల్లో 30శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని సూచించినది జీవన్ రెడ్డి కమిషన్
ఓటరు గుర్తింపు కార్డు లేని కారణంగా ఒక వ్యక్తి ఓటుని నిరాకరించడానికి వీల్లేదని తీర్పు ఇచ్చిన కోర్టు - అలహాబాద్ హైకోర్టు
20.
ఈ కింది వాటిల్లో ఓ వ్యవస్థ అమలులో లేదు. అదేంటో చెప్పండి
1) కేంద్ర ఎన్నికల సంఘం
2) ప్రాంతీయ ఎన్నికల సంఘం
3) ప్రధాన ఎన్నికల అధికారి
4) జిల్లా ఎన్నికల అధికారి
అన్నీ ఉన్నాయి
2 మాత్రమే
3 మాత్రమే
4 మాత్రమే
21.
ఈ కింది స్టేట్ మెంట్ లో ఏవి కరెక్ట్
1) త్రిసభ్య కమిషన్ గా మార్చడాన్ని అప్పటి CEC టీఎన్ శేషన్ వ్యక్తిగత హోదాలో కోర్టులో సవాల్ చేశారు
2) ఎన్నికల సంఘం ..కమిషన్ గా వ్యవహరించేటప్పుడు ముగ్గురు సభ్యుల్లో ఒకరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది
2 మాత్రమే కరెక్ట్
రెండూ తప్పే
రెండూ కరెక్ట్
1 మాత్రమే కరెక్ట్
22.
ఈ కింది రెండు స్టేట్ మెంట్స్ పరిశీలించండి
1) ఓటరు తను వేసిన ఓటు సరిగా నమోదైందా లేదా తెలుసుకునేందుకు VV PAT మిషన్ ను ప్రవేశపెట్టారు
2) VVPAT అనగా Voter Verifiable Paper Audit Trail
3) దీన్ని మొదట 2013 సెప్టెంబర్ లో నాగాలాండ్ లోని నోక్సస్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు
వీటిల్లో ఏవి కరెక్ట్
2,3 మాత్రమే
1 మరియు 3 మాత్రమే
1, 2 మాత్రమే
1,2,3 కరెక్ట్
23.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందడాలనికి కావల్సిన అర్హతలు
1) లోక్ సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందిన పార్టీ
2) కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ
3) లోక్ సభ మొత్తం స్థానాల్లో కనీసం 2శాతం సీట్లు అంటే 11 స్థానాలను 3 రాష్ట్రాల్లో గెలుపొందాలి
4) కనీసం 3 రాష్ట్రాల్లో 20శాతం లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి 25శాతం ఓట్లు పొందాలి
1,2,3 మాత్రమే
అన్నీ కరెక్ట్
3,4 మాత్రమే
1,2 మాత్రమే
24.
NOTA కి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
1) అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఆప్షన్ కోసం నోటాని 2013 డిసెంబర్ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు
2) 2013 లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు
3) ప్రపంచంలో అప్పటికే 13 దేశాల్లో నోటా పద్దతిని అవలంభిస్తున్నారు
4) మొదట ఢిల్లీ, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ప్రవేశపెట్టారు
అన్నీ కరెక్ట్
1,2,4 మాత్రమే
3,4 మాత్రమే
1,2,3 మాత్రమే
25.
ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం అంటే
పోలై చెల్లిన ఓట్ల్లో 1/3 వంతు కన్నా తక్కువగా ఓట్లు వస్తే
పోలై చెల్లిన ఓట్ల్లో 2/3 వంతు కన్నా తక్కువగా ఓట్లు వస్తే
పోలై చెల్లిన ఓట్ల్లో 2/6 వంతు కన్నా తక్కువగా ఓట్లు వస్తే
పోలై చెల్లిన ఓట్ల్లో 1/6 వంతు కన్నా తక్కువగా ఓట్లు వస్తే
Loading...
Post Views:
3,701