70-ST-CURRENT AFFAIRS NOV 16-30

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

 

1. రైతు బంధుకి ఐరాస గుర్తింపుపై ఈ కింది అంశాల్లో సరైనవి ఏవి
ఎ) ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఐరాస ఎంపిక చేసింది. వీటిల్లో రైతు బంధు, రైతు బీమాకి స్థానం దక్కింది
బి) UNO లోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయం రోమ్ లో కార్యక్రమం జరిగింది
సి) నవంబర్ 21 నుంచి 23 వరకూ వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు అనే అంతర్జాతీయ సదస్సు జరిగింది
డి) ఈ సదస్సులో రెండు పథకాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పార్ధసారధి ప్రజెంటేషన్ ఇచ్చారు
2. ఈ కింది స్టేట్ మెంట్స్ లో తప్పుగా చెప్పినది ఏది
1) ఎకనామిక్ టైమ్స్ పత్రిక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ కు ప్రకటించారు
2) సీఎం పీఆర్వో మనం జ్వాలా నరసింహారావు రాసిన పుస్తకం ఇదీ సుపరిపాలన
3) ప్రముఖ కవయిత్రి మట్టిపూలు వ్యవస్థాపకులు జూపాక సుభద్రకి ప్రజాకవి కాళోజీ అవార్డు లభించింది
4) నవతెలంగాణ దినపత్రిక కార్టూనిస్ట్ పీ నర్సింహకి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2018 అవార్డు లభించింది
3. వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథకు సంబంధించి ఈ కింది వాక్యాల్లో సరైనది ఏది

ఎ) 2018 నవంబర్ 15న క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథ 281 అండ్ బియాండ్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు
బి) 281 పేరు పెట్టడానికి కారణం : 2001లో కోల్ కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులతో భారత్ అప్పటి సిరీస్ ను గెలుచుకుంది
సి) ఈ పుస్తకాన్ని రాసింది కౌశిక్.
డి) వెస్ట్ లాండ్ పబ్లికేషన్స్ 281 అండ్ బియాండ్ పుస్తకాన్ని మార్కెట్లోకి తెచ్చింది
4. వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు - వారికి సంబంధించిన అంశాలను జతపరచండి
1) శంతను నారాయణ్
2) పీటర్ పావిటర్ థిల్లాన్
3) జూపాక సుభద్ర
4) పంకజ్ అద్వానీ

ఎ) ఫార్చ్యూన్ మేగజైన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లో 12వ స్థానం
బి) కాళోజీ అవార్డు అందుకున్నారు
సి) ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ పాయింట్ల ఫార్మాట్ విజేత
డి) కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారతీయ రైతు
5. తెలుగు విశ్వవిద్యాలయం 2017 ప్రతిభా అవార్డులు అందుకున్న వారు - వారి రంగానికి సంబంధించి జతపరచండి
1) దేవులపల్లి అమర్
2) ద్వానా శాస్త్రి
3) భాగవతుల సేతురం
4) కె.సూర్య భగవంతరావు
5) ముద్దు రాజయ్య

ఎ) జానపదం
బి) అవధానం
సి) విమర్శ
డి) నృత్యం
ఇ) పత్రికా రంగం
6. జీశాట్ - 29 ప్రయోగానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా ఏది చెప్పారు
ఎ) ఇస్రో చేపట్టిన GSLV మార్క్ 3-డి2 రాకెట్ ప్రయోగం 2018 నవంబర్ 14న విజయవంతమైది
బి) మార్క్ 3 డీ2 ఉపగ్రహం ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్ 29ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు
సి) ఈ శాటిలైట్ తో జమ్ము కశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్స్ అవసరాలు తీరతాయి
డి) జీశాట్ 29న జీవిత కాలం 25యేళ్ళు. బరువు: 3,423 కిలోలు
7. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్: ద ట్రూ స్టోరీ అనే పుస్తకాన్ని రాసిన కేంద్ర మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఎవరు ?
8. ఎంప్లాయ్ బిలిటీ ర్యాంకింగ్స్ గురించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది
9. 2018 నవంబర్ లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు వారికి సంబంధించి అంశాల్లో సరైనవి

1) వ్యాపార ప్రకటనలు తీసుకొచ్చిన యాడ్ గురు అలైఖ్ పదమ్ సీ నవంబర్ 17న మరణించారు
2) కేంద్ర పెట్రోలియం రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ నవంబర్ 12న మరణించారు
3) అమెరికాలో డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా ఇండో అమెరికన్ న్యాయవాది నియోమీ రావు నామినేట్ అయ్యారు
4) బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావుకి విద్యా నాయకత్వం అవార్డు దక్కింది
10. 2018 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో తెలంగాణకి ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు లభించింది
బి) లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది రచయిత అంపశయ్య నవీన్ కు దక్కింది
సి) ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి యువ అంబాసిడర్ గా మన రాష్ట్రానికి చెందిన యువ గాయని నహిద్ అఫ్రీన్ నియమితులైంది
డి) మహిళల వరల్డ్ ఛాంపియన్షిప్ 48 కిలోల ఫైనల్లో భారత బాక్సర్ మేరీ కోమ్ స్వర్ణం సాధించింది
11. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ కింది అంశాల్లో ఏవి సరైనవి

1) సాంస్కృతిక సారధి ఛైర్మన్ గా బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది
2) రాష్ట్రంలోనే మొదటి బ్రెయిలీ లిపి డిజిటల్ ప్రింటర్ మలక్ పేటలోని బ్రెయిలీ ఈ-ప్రెస్ ఆఫీస్ లో ప్రారంభించారు
3) హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) 60 యేళ్ళు పూర్తి చేసుకుంది
4) రాష్ట్రంలోని పరిశ్రమలోకెల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ పురస్కారం సింగరేణి కాలరీస్ సంస్థకు దక్కింది
12. వాయు కాలుష్యం - ఆరోగ్యం అనే అంశంపై ఇటీవల మొదటి గ్లోబల్ కాన్ఫరెన్స్ ను ఎక్కడ నిర్వహించారు ?
13. వ్యక్తులు - పదవులు జతపరచండి
1) ఇబ్రహీం మహ్మద్ సోలిహె
2) ఎస్కే మిశ్రా
3) థామస్ కురియన్
4) సూర్య ప్రకాశ్

ఎ) ప్రసార భారతి ఛైర్మన్
బి) గూగుల్ క్లౌడ్ CEO
సి) ED డైరక్టర్
డి) మాల్దీవుల అధ్యక్షుడు
14. మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తకాన్ని 2018 నవంబర్ 27న ఢిల్లీలో ఆవిష్కరించారు. విద్య, వైద్యం లాంటి అంశాలపై 51 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ పుస్తకాన్ని ఈ కింది వారిలో ఎవరు రాశారు ?
1) బిబేక్ దేబ్రాయ్
2) కిశోర్ దేశాయ్
3) అనిర్బన్ గంగూలీ
4) కౌశిక్ ఛటోపాధా్య
15. క్రీడాకారులకు సంబంధించి ఈ కింది పేర్కొన్న రెండు ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) ఒలింపిక్స్ లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య అత్యున్నత పురస్కారం బ్లూక్రాస్ ప్రదానం చేసింది
బి) ఆల్ట్రా రన్నింగ్ లో అథ్లెట్ ఉల్లాస్ నారాయణ్ భారత్ కు మొదటి అంతర్జాతీయ పతాకాన్ని అందించారు
16. క్రీడాకారులు - అంశాలు జతపరచండి
1) రామ్ కుమార్ రామనాథన్
2) కార్ల్ సన్
3) ఇషా సింగ్
4) ఉల్లాస్ నారాయణ్

ఎ) షూటింగ్
బి) చెస్
సి) అల్ట్రా రన్నింగ్
డి) టెన్నిస్
17. ఓబీసీ కమిషన్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు

ఎ) ఇతర వెనుకబడిన కులాల్లో వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ రోహిణి కమిషన్ పనిచేస్తోంది
బి) కమిషన్ కాలపరిమితిని 2019 మార్చి 31 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది
సి) ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని కమిషన్ లో ఐదుగురు సభ్యులు ఉంటారు
డి) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం 2017 అక్టోబర్ లో ఈ కమిషన్ ఏర్పాటైంది
18. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా (నాసి) యంగ్ సైంటిస్ట్ అవార్డులకు సంబంధించి శాస్త్రవేత్తలు - వారి రంగాలు జతపరచండి
1) జితేందర్ సింగ్
2) మద్దిక సుబ్బారెడ్డి
3) విమల్ చంద్ర శ్రీవాస్తవ
4) అజయ్ ఎస్ కరాకటి

ఎ) ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్స్
బి) ఎన్విరాన్ మెంటల్లీ సౌండ్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్
సి) బయో మెడికల్ రీసెర్చ్, హెల్త్ కేర్
డి) అగ్రికల్చర్, ప్లాంట్ సైన్స్, రూరల్ డెవలప్ మెంట్
19. ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది
1) 2030 నాటికి చెన్నై-మైసూరు మధ్య రూ.లక్ష కోట్ల వ్యయంతో హైస్పీడ్ రైళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దేశం - జర్మనీ
2) అపోలో టైర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ - సచిన్ టెండూల్కర్
3) ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్
4) మహిళా ఓటర్లు ఓట్లు వేయడానికి సంగ్వారీ పేరుతో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసిన రాష్ట్రం - చత్తీస్ గఢ్
20. PSLV-C43 కి సంబంధించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) PSLV-C43 ద్వారా 31 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
బి) ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ లో మన దేశానికి చెందిన ఉపగ్రహం- హైసిస్ ( హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ )
సి) PSLV-C43 ద్వారా 8 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు
డి) 2018 నవంబర్ 29న ఇస్రో PSLV - C43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది
21. UPSC ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
22. భారత్ లో జరిగిన ప్రపంచ హాకీ కప్ గురించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది
ఎ) 2018 హాకీ ప్రపంచ కప్ కి అతిథ్యం ఇచ్చిన దేశం భారత్. గతలో 1982 లో ముంబై, 2010 లో ఢిల్లీలో జరిగాయి.
బి) 2018 నవంబర్ 27 నుంచి హాకీ ప్రపంచ కప్ ఒడిశాలోని భువనేశ్వర్ లో మొదలైంది
సి) 2018 హాకీ ప్రపంచ కప్ యొక్క అధికారిక చిహ్నం - ఒలీ ( ఒలివ్ రిడ్లే సముద్ర తాబేలు)
డి) భారత్ లో జరిగిన ప్రపంచ కప్ లో పాల్గొంటున్న దేశాలు - 20 జట్లు
23. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్ పోల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు
24. దేశంలోనే అత్యంత ధనిక రియల్టర్ గా ఎవరు నిలిచారు
25. 75,330 కోట్ల డాలర్లతో అమెరికాలోనే అత్యంత విలువైన కంపెనీగా ఏ సంస్థ నిలిచింది ?