68-ST- CURRENT AFFAIRS NOV 1 TO 15

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

 

1. హైదరాబాద్ మెట్రో రైలుకి గ్రీన్ ప్లాటినం అవార్డుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది వాస్తవం
ఎ) రసూల్ పుర, ప్యారడైజ్, ప్రకాశ్ నగర్ స్టేషన్ల నిర్మాణాలు పర్యావరణహితంగా ఉండటంతో గ్రీన్ ప్లాటినం అవార్దుకు ఎంపికయ్యాయి.
బి) దేశంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించే నిర్మాణాలను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రోత్సహిస్తోంది
సి) పాయింట్ల ఆధారంగా ప్లాటినం, గోల్డ్, సిల్వర్ రేటింగ్ లను IGBC ఇస్తోంది
డి) హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్ల నిర్మాణంలో సహజ వనరులను ఉపయోగించుకోవడంతో గ్రీన్ ప్లాటినం అవార్డు దక్కింది
2. విద్యుత్ వినియోగ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పుగా చెప్పారు

ఎ) 2016-17 లో దేశ ప్రజలు వినియోగించిన కరెంట్ లెక్కల ద్వారా కేంద్రీయ విద్యుత్ మండలి 2017-18 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది
బి) 2014-15లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1084 యూనిట్లు ఇప్పుడు 1727కు చేరింది
సి) తెలంగాణ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఏపీ, మహారాష్ట్ర నిలిచాయి
డి) జాతీయ స్థాయి తలసరి వినియోగం 1149 నుంచి 1122 యూనిట్లకు తగ్గింది.
3. కాపలా లేని రైల్వే గేట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలతో దక్షిణ మధ్య రైల్వే లక్ష్యాన్ని చేరుకుంది. 2016-17 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అందుకోసం ఏ నినాదాన్ని ప్రకటించింది
4. 2018 నవంబర్ 9న మరణించిన కపిలవాయి లింగమూర్తికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి కరెక్ట్

ఎ) కవి, రచయిత, పరిశోధకుడు లింగమూర్తి స్వగ్రాం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంట
బి) భాగవత కథా తత్వం, సాలగ్రామ శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, మాంగళ్య శాస్త్రం, స్వర్ణ శకలాలు ఆయన రచించిన గ్రంథాలు (మొత్తం ప్రచురితమైన రచనలు 87)
సి) కపిలవాయికి 2014 ఆగస్టు 30న తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది
డి) తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న మొదటి వ్యక్తి కపిలవాయి
5. ముఖ్యమంత్రి కేసీఆర్ 51 నెలల పాలనపై ముఖ్య ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రాసిన రెండు పుస్తకాల పేర్లేంటి ?
6. హైదరాబాదీ క్రికెట్ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథతో వస్తున్న పుస్తకం ఏది ?
7. ఇంట్లోని నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు చెప్పేందుకు పిల్లలే గురువులుగా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రారంభించబోయే పథకం పేరేంటి ?
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత అణగారిన దేశం ఏది ?
9. ఈ క్రింది ప్రకటనల్లో సరైనది ఏది
1) బుల్లి 3డీ ఇల్లును త్వష్ణ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ పేరుతో రూపొందించిన IIT ఏది - IIT హైదరాబాద్
2) శత్రువుల రాడార్లకి దొరక్కుండా కొత్త తరం మానవరహిత యుద్ధ విమానాన్ని చైనా తయారు చేసింది. దాని పేరు - CH 7
3) లిటిల్ ఇండియా గేట్ - అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీన్ని మెడాన్ (ఇండోనేషియా) సిటీలో ప్రారంభించారు
10. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం 2018 అందుకున్న వారు - వారి రంగాలను జతపరచండి
1) అంపశయ్య నవీన్
2) బాలికా విద్య
3) దివ్యాంగులకు ఉచిత విద్య

ఎ) ఎం.మంగాదేవి
బి) సాహిత్య సేవ
సి) వంశీరామరాజు
11. M777 శతుఘ్నులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
ఎ) 2018 నవంబర్ 9న మహారాష్ట్రలోని దేవ్ లాలిలో జరిగిన కార్యక్రమంలో వీటిని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ సైన్యంలోకి చేర్చారు
బి) M777 తేలికపాటి అమెరికా హోవిట్జర్లు, కే9 వజ్ర శతఘ్నులు, వీటిని మోసుకెళ్ళే సమీకృత వాహనాలు ఉన్నాయి
సి) 2016 నవంబర్ లో రూ.5,070 కోట్లతో ఇజ్రాయెల్ తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
డి) అన్నీ కరెక్ట్
12. గ్రామాలు, నగరాలు పేర్లు - మార్చినవి/ కేంద్రం పరిశీలనలో ఉన్న వాటిని కరెక్ట్ గా జతపరచినవి గుర్తించండి
1) అలహాబాద్ - ప్రయోగ్ రాజ్
2) ఫైజాబాద్ - అయోధ్య
3) రాజమండ్రి - రాజమహేంద్రవరం
4) ఔటర్ వీలర్ - APJ అబ్దుల్ కలామ్ ఐలాండ్
5) అరిక్కోడ్ - అరీకోడ్
6) పిండారి పందు - పిండార
7) సాంపూర్ - సాన్ పూరె
13. నదీ మార్గాల ద్వారా సరుకును చౌకగా రవాణా చేయడానికి ఉద్దేశించిన జల్ మార్గ్ నివాస్ పథకానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్

ఎ) కోల్ కతా దగ్గర్లోని హల్దియాలో గంగానది జలాల నుంచి వారణాసికి వచ్చిన సరుకు రవాణా నౌకకి ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు
బి) నదుల్లో నౌకాయానం ద్వారా సరుకు రవాణాకి ఉద్దేశించిన మల్టీ మోడల్ టెర్మినల్ ను ప్రధాని మోడీ వారణాసిలో ప్రారంభించారు
సి) దేశీయ నదీ మార్గాలను సరుకు రవాణాకి ఉపయోగించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5369 కోట్లతో జల మార్గ్ నివాస్ పథకం తెచ్చింది
డి) ఈ పథకానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ చెరిసగం భరిస్తాయి
14. వివిధ పదవులు చేపట్టిన వారు, హోదాలు జతపరచండి
1) సునీల్ అరోరా
2) అరవింద్ సక్సేనా
3) జస్టిస్ రంజన్ గొగోయ్
4) జస్టిస్ మదన్ బి.లోకుర్

ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్
సి) UPSC ఛైర్మన్
డి) జాతీయ న్యాయ సేవల అథారిటీ కార్యనిర్వాహక ఛైర్మన్
15. 2018 నవంబర్ లో వార్తల్లోకి వచ్చిన న్యూకెలెడోనియాకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్
16. 2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులకు సంబంధించి ఈ ప్రకటనల్లో ఏది వాస్తవం

ఎ) ఇందులో భారత్ కి 77వ ర్యాంకు లభించింది (గత ఏడాది కంటే 23 స్థానాలు ఎగబాకింది )
బి) 2019 ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్న దేశం -న్యూజిలాండ్
సి) రెండో స్థానంలో సింగపూర్, మూడు - డెన్మార్క్, నాలుగు - హాంకాంగ్
డి) అమెరికాకి 8, చైనాకి 46, పాకిస్తాన్ కి 136 స్థానాలు దక్కాయి
17. INS అరిహంత్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు

ఎ) భారత నౌకా దళానికి చెందిన అణు జలాంతర్గామి INS అరిహంత్
బి) అరిహంత్ అంటే శత్రు సంహారిణి అని అర్థం
సి) 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణుదాడి చేయగల సామర్థ్యం ఉంది
డి) అరిహంత్ నీటిలో 600 మీటర్ల లోతుకు వెళ్ళగలదు. ఇందులో 83 మెగావాట్ల అణు విద్యుత్ రియాక్టర్ ఉంది
18. ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) క్యాన్సర్ కణాల జాడ కనిపెట్టి, వాటిని అంతం చేసే సరికొత్త నానో కార్బన్ పదార్థాన్ని ఐఐటీ రూర్కీ పరిశోధకులు అభివృద్ధి చేశారు
బి) సాధారణ పుట్టగొడుగుల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే బయోనిక్ పరికరాన్ని అమెరికాలోని స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు
సి) మానవ మెదడు లాగా ఉండే అతిపెద్ద కంప్యూటర్ (స్పైకింగ్ న్యూరల్ నెట్ వర్క్ ఆర్కిటెక్చర్ - స్పిన్నేకర్) ను బ్రిటన్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్మించారు.
డి) మొబైల్స్, నిఘా కెమెరాల్లో వాడే స్వదేశీ మైక్రో ప్రాసెసర్లను ఐఐటీ - మద్రాస్ నిపుణులు సిద్ధం చేశారు
19. GSLV మార్క్ 3 గురించిన ఈ స్టేట్ మెంట్స్ లో ఏది తప్పు

1) బాహుబలి, ఫ్యాట్ బాయ్ గా పిలిచే ఈ వాహక నౌక 3423 కిలోల బరువున్న జీశాట్ 29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది
2) ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా ఈ ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ కక్ష్యలో ఉంచారు
3) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో జీశాట్ 29 శాటిలైట్ నిర్మించారు.
4) ఇస్రో రూపొందించిన 50వ సమాచార ఉపగ్రహం ఇది
20. క్రీడాకారులు - వారి ఆటలు జతపరచండి
1) కైనన్ షెనాయ్
2) రామ్ కుమార్ రామనాథన్
3) సమీర్ వర్మ
4) మన్ ప్రీత్ సింగ్

ఎ) షూటింగ్
బి) బ్యాడ్మింటన్
సి) హాకీ
డి) టెన్నిస్
21. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను సందర్బంగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చేపట్టిన యాత్ర ఏది ?
22. ఇన్ఫోసిస్ అవార్డులు అందుకున్న వారు - ఏ రంగంలో ప్రావీణ్యులు
1) మొఘల్, రాజపుత్, దక్కన్ కళలపై అధ్యయనం
2) మాలిక్యులర్ మోటార్ ప్రొటీన్స్ పై పరిశోధన
3) వాతావరణ మార్పులపై కృషి
4) క్వాంటం అంశంలో మార్పులు

ఎ) ప్రొ.నళిని
బి) ప్రొ.ఎస్.కె.సతీష్
సి) ప్రొ. రూప్ మల్లిక్
డి) ప్రొ.కవితా సింగ్
23. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఇంక్రెడిబుల్ హల్క్ లాంటి పాత్రలను రూపొందించిన సూపర్ హీరోల సృష్టికర్త, హాలీవుడ్ రచయిత చనిపోయారు. ఆయన పేరేంటి ?
24. కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్
1) బెజవాడ గోపాలరెడ్డి పురస్కారం అందుకున్నది - డాక్టర్ నందిని సిధారెడ్డి
2) ఆచార్య మడుపు కులశేఖర్ రావు సాహితీ పురస్కారం - టి.గౌరీ శంకర్
25. జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో 13 బంగారు పతకాలు గెలుచుకున్న సిమోన్ బైల్స్ ఏ దేశానికి చెందిన అథ్లెట్ ?
26. 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఇది ఎక్కడ జరిగింది ?