84-AP-CURRENT AFFAIRS NOV 16-30

ఏపీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కు కలిపి తయారు చేసిన 258 మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/

1. వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథకు సంబంధించి ఈ కింది వాక్యాల్లో సరైనది ఏది

ఎ) 2018 నవంబర్ 15న క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథ 281 అండ్ బియాండ్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు
బి) 281 పేరు పెట్టడానికి కారణం : 2001లో కోల్ కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులతో భారత్ అప్పటి సిరీస్ ను గెలుచుకుంది
సి) ఈ పుస్తకాన్ని రాసింది కౌశిక్.
డి) వెస్ట్ లాండ్ పబ్లికేషన్స్ 281 అండ్ బియాండ్ పుస్తకాన్ని మార్కెట్లోకి తెచ్చింది
2. వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు - వారికి సంబంధించిన అంశాలను జతపరచండి
1) శంతను నారాయణ్
2) పీటర్ పావిటర్ థిల్లాన్
3) జూపాక సుభద్ర
4) పంకజ్ అద్వానీ

ఎ) ఫార్చ్యూన్ మేగజైన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లో 12వ స్థానం
బి) కాళోజీ అవార్డు అందుకున్నారు
సి) ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ పాయింట్ల ఫార్మాట్ విజేత
డి) కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారతీయ రైతు
3. జీశాట్ - 29 ప్రయోగానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా ఏది చెప్పారు
ఎ) ఇస్రో చేపట్టిన GSLV మార్క్ 3-డి2 రాకెట్ ప్రయోగం 2018 నవంబర్ 14న విజయవంతమైది
బి) మార్క్ 3 డీ2 ఉపగ్రహం ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్ 29ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు
సి) ఈ శాటిలైట్ తో జమ్ము కశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్స్ అవసరాలు తీరతాయి
డి) జీశాట్ 29న జీవిత కాలం 25యేళ్ళు. బరువు: 3,423 కిలోలు
4. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్: ద ట్రూ స్టోరీ అనే పుస్తకాన్ని రాసిన కేంద్ర మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఎవరు ?
5. ఎంప్లాయ్ బిలిటీ ర్యాంకింగ్స్ గురించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది
6. 2018 నవంబర్ లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు వారికి సంబంధించి అంశాల్లో సరైనవి

1) వ్యాపార ప్రకటనలు తీసుకొచ్చిన యాడ్ గురు అలైఖ్ పదమ్ సీ నవంబర్ 17న మరణించారు
2) కేంద్ర పెట్రోలియం రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ నవంబర్ 12న మరణించారు
3) అమెరికాలో డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా ఇండో అమెరికన్ న్యాయవాది నియోమీ రావు నామినేట్ అయ్యారు
4) బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావుకి విద్యా నాయకత్వం అవార్డు దక్కింది
7. వాయు కాలుష్యం - ఆరోగ్యం అనే అంశంపై ఇటీవల మొదటి గ్లోబల్ కాన్ఫరెన్స్ ను ఎక్కడ నిర్వహించారు ?
8. వ్యక్తులు - పదవులు జతపరచండి
1) ఇబ్రహీం మహ్మద్ సోలిహె
2) ఎస్కే మిశ్రా
3) థామస్ కురియన్
4) సూర్య ప్రకాశ్

ఎ) ప్రసార భారతి ఛైర్మన్
బి) గూగుల్ క్లౌడ్ CEO
సి) ED డైరక్టర్
డి) మాల్దీవుల అధ్యక్షుడు
9. మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తకాన్ని 2018 నవంబర్ 27న ఢిల్లీలో ఆవిష్కరించారు. విద్య, వైద్యం లాంటి అంశాలపై 51 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ పుస్తకాన్ని ఈ కింది వారిలో ఎవరు రాశారు ?
1) బిబేక్ దేబ్రాయ్
2) కిశోర్ దేశాయ్
3) అనిర్బన్ గంగూలీ
4) కౌశిక్ ఛటోపాధా్య
10. క్రీడాకారులకు సంబంధించి ఈ కింది పేర్కొన్న రెండు ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) ఒలింపిక్స్ లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య అత్యున్నత పురస్కారం బ్లూక్రాస్ ప్రదానం చేసింది
బి) ఆల్ట్రా రన్నింగ్ లో అథ్లెట్ ఉల్లాస్ నారాయణ్ భారత్ కు మొదటి అంతర్జాతీయ పతాకాన్ని అందించారు
11. క్రీడాకారులు - అంశాలు జతపరచండి
1) రామ్ కుమార్ రామనాథన్
2) కార్ల్ సన్
3) ఇషా సింగ్
4) ఉల్లాస్ నారాయణ్

ఎ) షూటింగ్
బి) చెస్
సి) అల్ట్రా రన్నింగ్
డి) టెన్నిస్
12. ఓబీసీ కమిషన్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు

ఎ) ఇతర వెనుకబడిన కులాల్లో వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ రోహిణి కమిషన్ పనిచేస్తోంది
బి) కమిషన్ కాలపరిమితిని 2019 మార్చి 31 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది
సి) ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని కమిషన్ లో ఐదుగురు సభ్యులు ఉంటారు
డి) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం 2017 అక్టోబర్ లో ఈ కమిషన్ ఏర్పాటైంది
13. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా (నాసి) యంగ్ సైంటిస్ట్ అవార్డులకు సంబంధించి శాస్త్రవేత్తలు - వారి రంగాలు జతపరచండి
1) జితేందర్ సింగ్
2) మద్దిక సుబ్బారెడ్డి
3) విమల్ చంద్ర శ్రీవాస్తవ
4) అజయ్ ఎస్ కరాకటి

ఎ) ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్స్
బి) ఎన్విరాన్ మెంటల్లీ సౌండ్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్
సి) బయో మెడికల్ రీసెర్చ్, హెల్త్ కేర్
డి) అగ్రికల్చర్, ప్లాంట్ సైన్స్, రూరల్ డెవలప్ మెంట్
14. ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది
1) 2030 నాటికి చెన్నై-మైసూరు మధ్య రూ.లక్ష కోట్ల వ్యయంతో హైస్పీడ్ రైళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దేశం - జర్మనీ
2) అపోలో టైర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ - సచిన్ టెండూల్కర్
3) ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్
4) మహిళా ఓటర్లు ఓట్లు వేయడానికి సంగ్వారీ పేరుతో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసిన రాష్ట్రం - చత్తీస్ గఢ్
15. PSLV-C43 కి సంబంధించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) PSLV-C43 ద్వారా 31 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
బి) ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ లో మన దేశానికి చెందిన ఉపగ్రహం- హైసిస్ ( హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ )
సి) PSLV-C43 ద్వారా 8 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు
డి) 2018 నవంబర్ 29న ఇస్రో PSLV - C43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది
16. UPSC ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
17. భారత్ లో జరిగిన ప్రపంచ హాకీ కప్ గురించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది
ఎ) 2018 హాకీ ప్రపంచ కప్ కి అతిథ్యం ఇచ్చిన దేశం భారత్. గతలో 1982 లో ముంబై, 2010 లో ఢిల్లీలో జరిగాయి.
బి) 2018 నవంబర్ 27 నుంచి హాకీ ప్రపంచ కప్ ఒడిశాలోని భువనేశ్వర్ లో మొదలైంది
సి) 2018 హాకీ ప్రపంచ కప్ యొక్క అధికారిక చిహ్నం - ఒలీ ( ఒలివ్ రిడ్లే సముద్ర తాబేలు)
డి) భారత్ లో జరిగిన ప్రపంచ కప్ లో పాల్గొంటున్న దేశాలు - 20 జట్లు
18. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్ పోల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు
19. దేశంలోనే అత్యంత ధనిక రియల్టర్ గా ఎవరు నిలిచారు
20. 75,330 కోట్ల డాలర్లతో అమెరికాలోనే అత్యంత విలువైన కంపెనీగా ఏ సంస్థ నిలిచింది ?
21. 2018 నవంబర్ ఏపీ కరెంట్ ఎఫైర్స్ కి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి
 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నం మారింది. కొత్తగా చేరిన చిహ్నాలు - బుద్ధుడు, ధర్మం, సంఘం ( త్రిరత్నాలు )
 2. ఏపీలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిన అమెరికా దిగ్గజ సంస్థ - అమెజాన్
 3. ఇంటెలిజంట్ గ్లోబల్ హబ్ (ఐ-హబ్ ) ను అమరావతిలో  ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు
 4. రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి రెండో భారీ పెట్టుబడి రూ.21,600 కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్స్ పేపర్ గ్రూపు అనుబంధ సంస్థ సినర్ మాస్ గ్రూపు ఈ జిల్లాలో తన పరిశ్రమను స్థాపిస్తోంది - ప్రకాశం జిల్లాలో
 5. యునెస్కో, MGIEP విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో టెక్ -2018 సమావేశాన్ని విశాఖలో నిర్వహించారు
22. ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) ఫార్ములా -1 పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్న పున్నమి ఘాట్ ప్రాంతాన్ని ఇకపై ఎన్టీఆర్ సాగర్ అని పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది

2) కర్నూలులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు . దీనికి సంబంధించి ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది

3) భూవివాద పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూధార్ పథకాన్ని ఉండవల్లి నివాసంలో జరిగిన ప్రజావేదికలో 2018 నవంబర్ 20 నాడు సీఎం ప్రారంభించారు

4) రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలతో ప్రజలకు సమర్థంగా సేవలు అందుతున్నట్టు ‘‘గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ అండ్ డిజిటల్ డివైడ్ : ద కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యయన నివేదిక వెల్లడించింది
23. 2018 నవంబర్ లో విడుదలైన ఇన్ స్పైర్ అవార్డులకు సంబంధించి ఈ కింది వాటిల్లో తప్పు ఏది
 1. దేశవ్యాప్తంగా Inspire అవార్డుల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది
 2. రాష్ట్రంలో మొత్తం 5,698 ప్రాజెక్టులు ఈ పురస్కారాలకు ఎంపిక అయ్యాయి
 3.  రాష్ట్రంలో 1772 అవార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది
 4. ఈ అవార్డు కింద ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు అందిస్తున్నది. వీటితో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసుకోవచ్చు
24. ఈ కింది ప్రకటనల్లో సరైన దానిని తెలపండి
 1. గుంటూరు జిల్లా నెకరికల్లు దగ్గర రూ.6,020 కోట్లతో చేపట్టే గోదావరి - పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనుల పైలాన్ ను సీఎం 2018 నవంబర్ 26న ఆవిష్కరించారు
 2. నెకరికల్లు దగ్గరే పేరే చర్ల - కొండమోడు రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించే రూ.736 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు
25. ఈ కింది ప్రకటనల్లో సరి కానిది ఏది
 1. విజయవాడలో మహిళలు, విద్యార్థునులకు రక్షణకు పోలీసులు రంగంలోకి దించిన టీమ్స్ : శక్తి టీమ్ లు
 2. కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ అని పేరు పెట్టారు
 3. 2019-20ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ళకి తగ్గకుండా రూ.6,649 కోట్లతో 4 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఉద్దేశించిన పథకం పేరు- ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం
 4. వివిధ ప్రభుత్వ శాఖలు మరింత సమర్థంగా పనిచేసేందుకు కొత్తగా వయాడెక్ట్ విధానం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వయాడక్ట్ విధానంలో ఉండేవి: విజన్, ఇన్నోవేషన్, అకౌంటబిలిటీ, డిజిటైజేషన్, ఉబరైజేషన్, కన్వర్జెన్స్, టెక్నాలజీ అండ్ ట్రాన్స్ ఫర్మేషన్లు