30-AP-CURRENT AFFAIRS (AUG 15-30)

ఏపీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కు కలిపి తయారు చేసిన 258 మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/

1. 2018 ఆగస్టు 15నాడు ఫ్రీడం బేబి చనిపోయింది. ఫ్రీడం బేబి అంటే...
2. వాణిజ్య వివాదాల సత్వర పరిష్కార బిల్లుకి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
ఎ) భారత్ ను మధ్యవర్తిత్వ కూడలిగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ, రాజీ సవరణ బిల్లు - 2018 ను ఆగస్టు 10 నాడు లోక్ సభ ఆమోదించింది
బి) 1996 నాటి చట్టానికి కేంద్రం సవరణ తీసుకొచ్చింది
సి) మధ్యవర్తిత్వ ప్రక్రియలో భాగంగా ఓ స్వతంత్ర సంస్థ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది
డి) మధ్యవర్తిత్వ ప్రక్రియ సులభతరం కావడం వల్ల వ్యయభారం తగ్గి, వివాదాల పరిష్కారం స్పీడప్ అవుతుంది
3. క్రిమినల్ లా (సవరణ) చట్టం - 2018 కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైన వాటిని గుర్తించండి
ఎ) ఈ చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆగస్టు 2018లో ఆమోదం తెలిపారు. అయితే 2018 ఏప్రిల్ 21 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
బి) మహిళలపై అత్యాచారం చేస్తే కనీస శిక్ష ఏడేళ్ళ నుంచి పదేళ్ళకు పెంచారు
సి) 16యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే కనీస శిక్షని పదేళ్ళ నుంచి 20యేళ్ళకి పెంచారు
డి) 12యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే కనీస శిక్ష 20 యేళ్ళు ఉంటుంది. జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారు
ఇ) సామూహిక అత్యాచారం జరిపితే నిందితులు జీవితాంతం జైల్లోనే ఉంటారు
4. వాహనాల్లో వాడే ఇంధనాన్ని బట్టి హాలోగ్రాం ఆధారిత వేర్వేరు రంగుల స్టిక్కర్లు అంటించాలని కేంద్ర రహదారి రవాణా - జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దానికి సంబంధించి ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్

ఎ) పెట్రోలు, CNG తో నడిచే వాహనాలకు లేత నీలం రంగు
బి) డీజెల్ తో నడిచే వాహనాలకు నారింజ రంగు
5. సన్ వే ఎక్సాస్కేల్ కు సంబంధించి ఈ స్టేట్ మెంట్స్ లో ఏది తప్పు
1) ఇది సెకనుకి బిలియన్ లెక్కలు చేయగల సూపర్ కంప్యూటర్. దీన్ని చైనా తయారు చేసింది
2) సెకనుకి కనీసం ఒక ఎక్సా ఫ్లాప్ లేదా బిలియన్ బిలియన్ లెక్కలు చేయగల కంప్యూటరన్ ఎక్సా స్కేల్ అంటారు
3) 2008లో వచ్చిన పెటా స్కేల్ కంప్యూటర్లతో పోలిస్తే వెయ్యి రెట్లు వేగం ఎక్కువ
4) 700 కోట్ల మంది క్యాలిక్యులేటర్లతో 33యేళ్ళ పటు చేసే లెక్కలను ఎక్సా స్కేల్ ఒక నిమిషంలో చేస్తుంది.
6. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 2018 ఆగస్టు 16 నాడు చనిపోయారు. ఆయనకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) వాజ్ పేయి 1957లో మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు
2) లోక్ సభకి 9 సార్లు, రాజ్యసభకి 2 సార్లు ఎన్నికయ్యారు
3) మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు
4) 1996 నుంచి 2004 వరకూ వాజ్ పేయి ప్రధానిగా పనిచేశారు
7. ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యంగా ఉన్న నగరాలకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1) మొదటిస్థానంలో నిలిచిన నగరం - వియన్నా (ఆస్ట్రియా రాజధాని)
2) మన దేశం నుంచి ఢిల్లీ (112), ముంబై (117) నగరాలకు చోటు దక్కింది
3) అత్యంత నియోసయోగ్య నగరాల్లో చివరి స్థానంలో నిలిచింది డమాస్కస్ ( సిరియా రాజధాని )
4) అట్టడుగు స్థానాల్లో ఢాకా, లాగోస్, కరాచీ కూడా ఉన్నాయి
8. 2019 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.2శాతంగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ రేటింగ్స్ ఏ సంస్థకి చెందినవి
9. JEE ( అడ్వాన్సుడ్ ) పరీక్షలో మార్పులు, చేర్పులు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
10. ఉన్నత విద్యలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం Atal Ranking of Insitutions on Innovation Achievement (ARRIA) ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ?
11. గగన్ యాన్ కి సంబంధించి ఈ కింది వాటిలో తప్పుగా చెప్పిన ప్రకటన ఏది
1) మానవ సహిత యాత్ర గగన్ యాన్ ను ఇస్రో 2020లో ప్రయోగించాలని నిర్ణయించింది
2) GSLV Mk-III వాహన నౌక ద్వారా గగన్ యాన్ ను పంపుతారు
3) ఇందులో ముగ్గురు వ్యోమగాములు 5 నుంచి వారం రోజుల పాటు అంతరిక్షంలో గడుపుతారు
4) గగన్ యాన్ కు. 10వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా
12. దేశాభిమానాన్ని చూరగొనే బ్రాండ్స్ జాబితాలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఏది ?
13. మెరైన్ హైడ్రాలిక్ సిస్టమ్ కలిగిన ఒకే ఒక భారతీ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ ఏది ?
14. హిందూ మహాసముద్రాల సదస్సు 2018 ఎక్కడ జరిగింది ?
15. 2018 ఆగస్టు 23న మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ రాసిన ఆటోబయోగ్రఫీ ఏది
16. 2018 ఆసియా క్రీడల మోటో ఏది ?
17. అటల్ జీ నే కహా - అనే పుస్తకం రాసింది ఎవరు ?
18. నేతా యాప్ గురించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్
1) ఈ యాప్ ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 24 ఆగస్టు 2018 నాడు ప్రారంభించారు
2) తమ ప్రజాప్రతినిధులకు ఓటర్లు రేటింగ్ ఇవ్వడానికి ఉద్దేశించినది
3) రాజకీయ నేతల్లో జవాబుదారీ తనం, పారదర్శకతను పెంచడం దీని ఉద్దేశ్యం
4) ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే రేటింగ్ ఇవ్వగలం
19. DRDO కి ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
20. 2018 ఆగస్టు 24 నాడు ఆస్ట్రేలియా 30వ ప్రధానిగా ప్రమాణం చేసింది ఎవరు ?
21. చిగురుగుంట బంగారు గనులకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
ఎ) చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని చిగురుగుంట బంగారు గనుల తవ్వకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
బి) రాష్ట్ర ప్రభుత్వ సంస్థ , జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (NMDC) తో ఒప్పందం కుదుర్చుకుంది
సి) ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ లో 263.01 హెక్టార్లలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నాయి
డి) చిగురుగుంట గనుల నుంచి 8.5 టన్నుల బంగారం వస్తుందని అంచనా వేశారు.( మొత్తం రూ.2477 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది )
22. ప్రాజెక్ట్ గాండీవకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
23. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు మై స్టాంప్ పేరుతో పోస్టల్ స్టాంపుల్లో ఈ కింది వాటిల్లో ఏయే ప్రసిద్ధ స్థలాల చిత్రాలను ప్రచురించారు
1) తిరుమల తిరుపడి దేవస్థానం
2) విజయవాడ కనకదుర్గ ఆలయం
3) శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి ఆలయం
4) గండికోట (కడప)
5) విజయవాడ కొండపల్లి
6) పాపికొండలు
24. ఉద్దానం కిడ్నీ వ్యాధి పరిశోధనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్

1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో జాతీయ వైద్య పరిశోధనా మండలి విశాఖలో విమ్స్ కేంద్రం ప్రారంభించింది
2) కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనేందుకు స్టాప్ -సీకేడీయూ పేరుతో చేపట్టిన ఆపరేషన్ జూన్ లో మొదలైంది
3) బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ, చండీగఢ్ కు పంపుతున్నారు
4) స్టాప్ - CKDU అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నోన్
25. భూగర్భ కాలువలు (డ్రైనేజీలు) శుభ్రం చేయడానికి రాష్ట్రంలో మొదటిసారిగా ఏ మున్సిపాలిటీలో రోబోలను అందుబాటులోకి తెచ్చారు