36-AP-CURRENT AFFAIRS SEPT 1 to 15th

ఏపీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కు కలిపి తయారు చేసిన 258 మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/

1. ఆసియా క్రీడల గురించి ఈ కింది వాటిలో ఏ ప్రకటన కరెక్ట్

ఎ) 1951లో మొదటి ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగాయి
బి) 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకూ ఇటీవల ఆసియా క్రీడలు జరిగాయి
సి) 1951 తర్వాత మళ్ళీ 1982లో మాత్రమే ఆసియా క్రీడలు భారత్ లో జరిగాయి
డి) 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి
2. ఇండోనేషియాలో జరిగిన 18వ ఆసియా క్రీడలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి

1) ప్రారంభ, ముగింపు వేడుకలు - గెలోరో బంగ్ కర్నోలో జరిగాయి
2) ఇండోనేషియా అధికార చిహ్నం - గరుడ పక్షి
3) ఆసియా క్రీడలు జకార్తా, పాలం బాగ్ లో జరిగాయి
4) ప్రస్తుతం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో
3. ఆసియా క్రీడల ప్రారంభానికి సరిగ్గా 48 గంటల ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఏ దేశ అథ్లెట్లు సొంత జెండాతో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు ?
4. ఆసియా క్రీడలకు సంబంధించి ఈ కింది అంశాలను జతపరచండి
1) మొత్తం ఈవెంట్స్ సంఖ్య
2) మొత్తం క్రీడాంశాలు
3) పాల్గొన్న దేశాలు
4) భారత్ క్రీడాకారులు

ఎ) 572
బి) 45
సి) 47
డి) 465
5. భారత్ కు చెందిన క్రీడాకారులు - వాళ్ళ క్రీడాంశాలు జతపరచండి
1) అపూర్వ చండేల
2) భజరంగ్ పూనియా
3) మల్లేష్
4) జ్యోతి సురేఖ

ఎ) ఎయిర్ ఫిస్టల్
బి) కబడ్డీ
సి) రెజ్లింగ్
డి) ఆర్చరీ
6. సంచలనం సృష్టించిన సెక్షన్ 377 గురించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది
1) సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరం
2) ఇది 1861 లో అమల్లోకి వచ్చింది
3) బ్రిటీష్ సొడొమీ చట్టం (బగ్గరీ యాక్ట్ 1533) ఆధారంగా రూపొందించారు
4) 1838లో థామస్ మెకాలే దీన్ని తయారు చేశారు
7. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి తప్పు

1) ఈ తీర్పుతో సెక్షన్ 377కు వ్యతిరేకంగా 17యేళ్ళ పోరాటానికి తెరపడింది
2) లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జండర్, క్వీర్ లు మిగతా పౌరుల్లాగే అన్ని రాజ్యాంగ పరమైన హక్కులు పొందవచ్చు
3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది
4) స్వలింగ సంపర్కాన్ని చట్ట బద్దం చేసిన 30వ దేశంగా భారత్ నిలిచింది
5) ప్రస్తుతం 120 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించడం లేదు
8. CGS విజయ్ గురించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) దేశీయంగా నిర్మించిన ఈ గస్తీ నౌక 2018 సెప్టెంబర్ 14న జలప్రవేశం చేసింది
2) 98మీటర్ల పొడవైన ఈ నౌకని DRDA నిర్మించింది
3) చెన్నైలో జలప్రవేశం చేసిన ఈ నౌక ఒడిశాలోని పారాదీప్ కేంద్రంగా పనిచేయనుంది
9. దులీప్ ట్రోఫీకి సంబంధించిన స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) దేశీవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలో 57వ ట్రోఫీ మ్యాచులు జరిగాయి
2) దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా బ్లూ జట్టు నిలిచింది
3) తమిళనాడులోని దిండిగల్ లో 2018 సెప్టెంబర్ 7న జరిగిన మ్యాచ్ లో రెడ్ జట్టుపై బ్లూ జట్టు విజయం సాధించింది
4) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : నిఖిల్ గుప్తా ( బ్లూ జట్టు బ్యాట్స్ మ్యాన్)
10. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ను 2018 సెప్టెంబర్ నెలలో మరోసారి పొడిగించారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా ఉన్నది ఏది
11. 2018 సెప్టెంబర్ లో మానవాభివృద్ధి నివేదికను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ ప్రకటనల్లో ఏది కరెక్ట్

ఎ) ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికగా ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఈ ర్యాంకులు ప్రకటిస్తుంది
బి) మొత్తం 189 దేశాలతో UNDP ఈ నివేదిక రూపొందించింది
సి) మానవాభివృద్ధి నివేదికలో భారత్ స్థానం 130
డి) ఆసియా సగటు HDI తో పోలిస్తే భారత్ 0.638 విలువతో కాస్త పెరిగింది
12. 2018 రామన్ మెగసెసే అవార్డులకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
13. PSLV-C42 ప్రయోగానికి సంబంధించి ఈ కింది ప్రకనట్లో ఏవి కరెక్ట్

1) 2018 సెప్టెంబర్ 16న ప్రయోగించారు. ఇందులో 23 దేశాలకు చెందిన 243 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
2) బ్రిటన్ కు చెందిన నోవా SAR, S1-4 ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లింది
3) S1-4 ఉపగ్రహం బరువు 444 కిలోలు. ఇది వనరులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీకి ఉద్దేశించింది
4) నోవా SAR తో అడవులు మ్యాపింగ్, వరదలు లాంటి విపత్తులు గుర్తించవచ్చు
14. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంనకు నాబార్డ్ రుణానికి సంబంధించి ఈ కింది పేర్కొన్న ప్రకటనల్లో ఏది తప్పు
15. లైంగిక నేరస్తుల జాతీయ రిజస్టర్ గురించి చెప్పిన ఈ ప్రకటనల్లో ఏది కరెక్ట్
ఎ) 2018 సెప్టెంబర్ 21న ఈ జాతీయ రిజిష్టర్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
బి) ఈ రిజిస్టర్ లో 4.40 లక్షల మంది క్రిమినల్స్ చిరునామా, వేలి ముద్రలు, ఆధార్, పాన్ నెంబర్లు, DNA నమూనాలు ఉంటాయి
సి) ఈ రిజిస్టర్ లో సమాచారాన్ని నేరాల తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో 15యేళ్ళు, తీవ్రత ఎక్కవగా ఉన్న కేసుల్లో 25యేళ్ళ భద్రంగా ఉంచుతారు
డి) ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఇలాంటి డేటాబేస్ లు నడుస్తున్నాయి
16. భారత్ లో బహుముఖ పేదరికం 27.5శాతానికి తగ్గినట్టు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ( UNDP ) తెలిపింది. ఈ సూచీ ప్రకారం దేవంలో బహుముఖ పేదరికంగా ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాలు ఏవి ?
17. భారత స్ర్పింటర్ ద్యుతీ చంద్ జీవిత చరిత్రపై త్వరలో పుస్తకం రానుంది. దీన్ని ఎవరు రాస్తున్నారు ?
18. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత షూటర్ ఎవరు ?
19. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట
1) ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించి 15 కేటగిరీల్లో 81అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది
2) ఉపాధి పథకాన్ని పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంలో నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్ర ఏపీ
3) పథకం సమర్థంగా అమలు చేస్తున్న జిల్లాలు - ప్రకాశం, విశాఖ
4) గ్రామస్థాయి పథకం అమలులో ప్రతిభ చూపిన కాటబైలు గ్రామం ( చిత్తూరు జిల్లా) ఉత్తమ పంచాయతీగా నిలిచింది
20. తల్లి బిడ్డా చల్లగా పథకంనకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
21. ఈ కింది వాటిల్లో ఏది ఖచ్చితం
1) దుల్హన్ పేరును దుల్హన్ చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు
2) గిరిపుత్రిక కళ్యాణ పథకం - గిరిపుత్రిక చంద్రన్న పెళ్ళి కానుకగా మార్చారు
22. ముఖ్యమంత్రి యువనేస్తం నకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది
ఎ) 2018 సెప్టెంబర్ 14న ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం వెబ్ సైట్ ను ప్రారంభించారు
బి) ఈ పథకం కింద 22-25 యేళ్ళ మధ్య వయస్సున్న నిరుద్యోగులు అర్హులు
సి) పథకం కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారు
డి) నిరుద్యోగ భృతిగా పిలిచే ఈ పథకాన్ని అర్హత సాధించాలంటే డిగ్రీ లేదా డిప్లోమా కనీస విద్యార్హత
23. స్వచ్ఛధార కు సంబంధించి ఈ ప్రకటనల్లో తప్పు ఏది
24. చేరువ కార్యక్రమానికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది సరైనది
ఎ) సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు పోలీసులు దగ్గరయ్యేందుకు చేరువ... మీ చెంతకు... మీ పోలీస్ కార్యక్రమం ప్రారంభించారు
బి) 2018 ఆగస్టు 31న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ప్రారంభిచారు
సి) 9440900822 వాట్సాప్, ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు. సామాజిక మాధ్యమాల అకౌంట్స్ ఏర్పాటు
డి) ఈ కార్యక్రమం కోసం విజయవాడలో ప్రత్యేక వాహనాన్ని డీజీపీ ప్రారంభించారు
25. తిరుపతి దగ్గరల్లో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఫర్ కేన్సర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్ )ను నిర్మిస్తున్నారు అందుకోసం 2018 ఆగస్టు 31న భూమి పూజ జరిగింది. ఏ సంస్థ దీన్ని నిర్మిస్తోంది