17-TS-CURRENT AFFAIRS (AUG 15-30)

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

1. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జినోమ్ బ్యాంక్ కు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్

1) సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ లో జన్యు బ్యాంకును ఏర్పాటు చేశారు
2) అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడటం, పునరుత్పత్తి చేయడం లక్ష్యం
3) జినోమ్ బ్యాంక్ ను కేంద్ర శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు
4) ఇది టీ-హబ్ కి అనుబంధంగా పనిచేస్తుంది
2. ఆరోగ్య రక్ష పథకానికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది తప్పు
ఎ) రాష్ట్రంలో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 24న ప్రారంభించారు
బి) ఒక్కో విద్యార్థినికి 21 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్స్ పంపిణీ చేశారు
సి) ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తున్నారు
3. వివిధ కార్పోరేషన్లు - ఛైర్మన్లకి కి సంబంధించి జతపరచండి
1) తెలంగాణ స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్
2) తెలంగాణ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్
3) సంగీత నాటక అకాడమీ

ఎ) దేవర మల్లప్ప
బి) గట్టు తిమ్మప్ప
సి) బాద్మి శివకుమార్
4. 2018 ఆగస్టు 15నాడు ఫ్రీడం బేబి చనిపోయింది. ఫ్రీడం బేబి అంటే...
5. వాణిజ్య వివాదాల సత్వర పరిష్కార బిల్లుకి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
ఎ) భారత్ ను మధ్యవర్తిత్వ కూడలిగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ, రాజీ సవరణ బిల్లు - 2018 ను ఆగస్టు 10 నాడు లోక్ సభ ఆమోదించింది
బి) 1996 నాటి చట్టానికి కేంద్రం సవరణ తీసుకొచ్చింది
సి) మధ్యవర్తిత్వ ప్రక్రియలో భాగంగా ఓ స్వతంత్ర సంస్థ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది
డి) మధ్యవర్తిత్వ ప్రక్రియ సులభతరం కావడం వల్ల వ్యయభారం తగ్గి, వివాదాల పరిష్కారం స్పీడప్ అవుతుంది
6. మినల్ లా (సవరణ) చట్టం - 2018 కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైన వాటిని గుర్తించండి
ఎ) ఈ చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆగస్టు 2018లో ఆమోదం తెలిపారు. అయితే 2018 ఏప్రిల్ 21 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
బి) మహిళలపై అత్యాచారం చేస్తే కనీస శిక్ష ఏడేళ్ళ నుంచి పదేళ్ళకు పెంచారు
సి) 16యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే కనీస శిక్షని పదేళ్ళ నుంచి 20యేళ్ళకి పెంచారు
డి) 12యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే కనీస శిక్ష 20 యేళ్ళు ఉంటుంది. జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారు
ఇ) సామూహిక అత్యాచారం జరిపితే నిందితులు జీవితాంతం జైల్లోనే ఉంటారు
7. వాహనాల్లో వాడే ఇంధనాన్ని బట్టి హాలోగ్రాం ఆధారిత వేర్వేరు రంగుల స్టిక్కర్లు అంటించాలని కేంద్ర రహదారి రవాణా - జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దానికి సంబంధించి ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్

ఎ) పెట్రోలు, CNG తో నడిచే వాహనాలకు లేత నీలం రంగు
బి) డీజెల్ తో నడిచే వాహనాలకు నారింజ రంగు
8. సన్ వే ఎక్సాస్కేల్ కు సంబంధించి ఈ స్టేట్ మెంట్స్ లో ఏది తప్పు
1) ఇది సెకనుకి బిలియన్ లెక్కలు చేయగల సూపర్ కంప్యూటర్. దీన్ని చైనా తయారు చేసింది
2) సెకనుకి కనీసం ఒక ఎక్సా ఫ్లాప్ లేదా బిలియన్ బిలియన్ లెక్కలు చేయగల కంప్యూటరన్ ఎక్సా స్కేల్ అంటారు
3) 2008లో వచ్చిన పెటా స్కేల్ కంప్యూటర్లతో పోలిస్తే వెయ్యి రెట్లు వేగం ఎక్కువ
4) 700 కోట్ల మంది క్యాలిక్యులేటర్లతో 33యేళ్ళ పటు చేసే లెక్కలను ఎక్సా స్కేల్ ఒక నిమిషంలో చేస్తుంది.
9. కౌమార బాలిక రుతుస్రావం, రుతు చక్రంపై అవగాహన కల్పించి, రక్తహీనతతో బాధ పడేవారిని గుర్తించి పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏది?
10. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 2018 ఆగస్టు 16 నాడు చనిపోయారు. ఆయనకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) వాజ్ పేయి 1957లో మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు
2) లోక్ సభకి 9 సార్లు, రాజ్యసభకి 2 సార్లు ఎన్నికయ్యారు
3) మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు
4) 1996 నుంచి 2004 వరకూ వాజ్ పేయి ప్రధానిగా పనిచేశారు
11. ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యంగా ఉన్న నగరాలకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1) మొదటిస్థానంలో నిలిచిన నగరం - వియన్నా (ఆస్ట్రియా రాజధాని)
2) మన దేశం నుంచి ఢిల్లీ (112), ముంబై (117) నగరాలకు చోటు దక్కింది
3) అత్యంత నియోసయోగ్య నగరాల్లో చివరి స్థానంలో నిలిచింది డమాస్కస్ ( సిరియా రాజధాని )
4) అట్టడుగు స్థానాల్లో ఢాకా, లాగోస్, కరాచీ కూడా ఉన్నాయి
12. 2019 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.2శాతంగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ రేటింగ్స్ ఏ సంస్థకి చెందినవి
13. JEE ( అడ్వాన్సుడ్ ) పరీక్షలో మార్పులు, చేర్పులు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
14. ఉన్నత విద్యలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం Atal Ranking of Insitutions on Innovation Achievement (ARRIA) ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ?
15. గగన్ యాన్ కి సంబంధించి ఈ కింది వాటిలో తప్పుగా చెప్పిన ప్రకటన ఏది
1) మానవ సహిత యాత్ర గగన్ యాన్ ను ఇస్రో 2020లో ప్రయోగించాలని నిర్ణయించింది
2) GSLV Mk-III వాహన నౌక ద్వారా గగన్ యాన్ ను పంపుతారు
3) ఇందులో ముగ్గురు వ్యోమగాములు 5 నుంచి వారం రోజుల పాటు అంతరిక్షంలో గడుపుతారు
4) గగన్ యాన్ కు. 10వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా
16. దేశాభిమానాన్ని చూరగొనే బ్రాండ్స్ జాబితాలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఏది ?
17. మెరైన్ హైడ్రాలిక్ సిస్టమ్ కలిగిన ఒకే ఒక భారతీ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ ఏది ?
18. హిందూ మహాసముద్రాల సదస్సు 2018 ఎక్కడ జరిగింది ?
19. 2018 ఆగస్టు 23న మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ రాసిన ఆటోబయోగ్రఫీ ఏది
20. 2018 ఆసియా క్రీడల మోటో ఏది ?
21. టల్ జీ నే కహా - అనే పుస్తకం రాసింది ఎవరు ?
22. రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో 1975లో విడుదలైన ఏ అధికరణం రద్దయింది ?
23. నేతా యాప్ గురించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్
1) ఈ యాప్ ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 24 ఆగస్టు 2018 నాడు ప్రారంభించారు
2) తమ ప్రజాప్రతినిధులకు ఓటర్లు రేటింగ్ ఇవ్వడానికి ఉద్దేశించినది
3) రాజకీయ నేతల్లో జవాబుదారీ తనం, పారదర్శకతను పెంచడం దీని ఉద్దేశ్యం
4) ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే రేటింగ్ ఇవ్వగలం
24. DRDO కి ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
25. 2018 ఆగస్టు 24 నాడు ఆస్ట్రేలియా 30వ ప్రధానిగా ప్రమాణం చేసింది ఎవరు ?