15-ST- ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల కమిషన్

1. జాతీయ పార్టీగా గుర్తింపు పొందడాలనికి కావల్సిన అర్హతలు

1) లోక్ సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందిన పార్టీ
2) కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ
3) లోక్ సభ మొత్తం స్థానాల్లో కనీసం 2శాతం సీట్లు అంటే 11 స్థానాలను 3 రాష్ట్రాల్లో గెలుపొందాలి
4) కనీసం 3 రాష్ట్రాల్లో 20శాతం లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి 25శాతం ఓట్లు పొందాలి
2. ఈ కింది వాటిల్లో ఓ వ్యవస్థ అమలులో లేదు. అదేంటో చెప్పండి
1) కేంద్ర ఎన్నికల సంఘం
2) ప్రాంతీయ ఎన్నికల సంఘం
3) ప్రధాన ఎన్నికల అధికారి
4) జిల్లా ఎన్నికల అధికారి
3. NOTA కి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఆప్షన్ కోసం నోటాని 2013 డిసెంబర్ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు
2) 2013 లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు
3) ప్రపంచంలో అప్పటికే 13 దేశాల్లో నోటా పద్దతిని అవలంభిస్తున్నారు
4) మొదట ఢిల్లీ, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ప్రవేశపెట్టారు
4. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది తప్పు
5. ఈ కింది స్టేట్ మెంట్ లో ఏవి కరెక్ట్

1) త్రిసభ్య కమిషన్ గా మార్చడాన్ని అప్పటి CEC టీఎన్ శేషన్ వ్యక్తిగత హోదాలో కోర్టులో సవాల్ చేశారు
2) ఎన్నికల సంఘం ..కమిషన్ గా వ్యవహరించేటప్పుడు ముగ్గురు సభ్యుల్లో ఒకరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది
6. 01) ఈ కింది వాటిని జతపరచండి
1) ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1950
2) ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951
3) ఎన్నికల నిర్వహణ, నిబంధనలు - 1961
4) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం -1952

ఎ) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, నియోజక గణం, షరతులు
బి) ఎన్నికల నిర్వహణ, నిబంధనలు
సి) ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గుర్తింపు
డి) ఓటర్లు, అర్హతలు, ఓటర్ల జాబితా తయారీ
7. ఈ కింది ఏ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు
8. ఎన్నికల కమిషన్ కు సంబంధించి క్వాసీ జ్యుడీషియల్ పవర్స్ అంటే ఏంటి ?
9. జతపరచండి
1) ఆర్టికల్ 324
2) ఆర్టికల్ 329
3) ఆర్టికల్ 243(కె)
4) ఆర్టికల్ 326

ఎ) సార్వత్రిక వయోజన ఓటు హక్కు
బి) రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు
సి) ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యం నిషేధం
డి) స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు
10. ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్
1) పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో నోటిఫికేషన్ జారీ చేస్తారు
2) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేస్తారు
3) ఈ రెండు నోటిఫికేషన్లను కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది
11. ప్రధాన ఎన్నికల కమిషనర్లను వారి పదవీ కాలం ప్రకారం క్రమపద్దతిలో రాయండి

1) టి.ఎన్ శేషన్
2) సుకుమార్ సేన్
3) బి.బి. టాండన్
4) నవీన్ చావ్లా
5) వి.ఎస్.రమాదేవి
12. ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
13. రాష్ట్ర ఎన్నికల సంఘంనకు సంబంధించి తప్పుగా పేర్కొన్న స్టేట్ మెంట్ ఏది
14. రాజకీయ పార్టీలు - ఎన్నికల గుర్తులు జతపరచండి
1) సమాజ్ వాదీ పార్టీ
2) పట్టలి మక్కల్ కచ్చి
3) మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన
4) అసోం గణపరిషత్

ఎ) సైకిల్
బి) మామిడి పండు
సి) రైల్ ఇంజన్
డి) ఏనుగు
15. ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం అంటే
16. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే

1) రాష్ట్ర శాసన సభలో కనీసం రెండు సీట్లు సాధించాలి
2) రాష్ట్ర శాసన సభ లేదా లోక్ సభ సాధారణ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6శాతం ఓట్లు రావాలి
3) రాష్ట్ర శాసన సభలో 3శాతం సీట్లు లేదా కనీసం 3 సీట్లు ( ఏదీ ఎక్కువైతే అది)
17. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకి అభిప్రాయబేధాలు వస్తాయి... అప్పుడు
18. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్లు - వారి కాలానికి సంబంధించిన ప్రత్యేకతలు జతపరచండి
1) జె.ఎం.లింగ్డో
2) కె.వి.కె సుందరం
3) టి.ఎన్ శేషన్
4) నాగేంద్ర సింగ్

ఎ) అతి తక్కువ కాలం CEC
బి) రామన్ మెగసెసే అవార్డు గ్రహీత
సి) ఎన్నికల సంస్కరణలు
డి) ఎక్కువ కాలం CEC
19. కమిటీలు - చర్చించిన అంశాలు జతపరచండి
1) దినేష్ గోస్వామి కమిటీ (1990)
2) వోహ్రా కమిటీ (1993)
3) ఇంద్రజిత్ గుప్తా కమిటీ (1998)
4) తంఖా కమిటీ (2010)

ఎ) ఎన్నికల చట్టాలు
బి) ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ నిధులు
సి) నేరాలు - రాజకీయ సంబంధాలు
డి) ఎన్నికల సంస్కరణలు
20. ఎన్నికల తేదీలు ప్రకటించడం లాంటి అంశాలు పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?
21. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఈ కింది ఏయే సందర్బాల్లో పార్లమెంట్, శాసన సభ సభ్యులు అనర్హులుగా గుర్తించబడతారు

1) రెండేళ్ళు తక్కువ కాకుండా శిక్ష పడినవారు
2) వరకట్న నిషేధం, ఆహార కల్తీ లాంటి నేరాల్లో 6యేళ్ళు కంటే తక్కువ కాకుండా శిక్ష పడితే
3) అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం కింద నేరం రుజువైన వారు
4) అవినీతి కింద తొలగించబడిన ప్రభుత్వ ఉద్యోగాలు 5యేళ్ళ వరకూ అనర్హులు
5) మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికపై ఓట్లు అడిగినప్పుడు
22. ఈ కింది రెండు స్టేట్ మెంట్స్ పరిశీలించండి

1) ఓటరు తను వేసిన ఓటు సరిగా నమోదైందా లేదా తెలుసుకునేందుకు VV PAT మిషన్ ను ప్రవేశపెట్టారు
2) VVPAT అనగా Voter Verifiable Paper Audit Trail
3) దీన్ని మొదట 2013 సెప్టెంబర్ లో నాగాలాండ్ లోని నోక్సస్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు

వీటిల్లో ఏవి కరెక్ట్
23. ఏ స్టేట్ మెంట్ తప్పు
24. పెద్ద రాష్ట్రాల్లోని లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యయపరిమితి ఎంత
25. ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఏ స్టేట్ మెంట్స్ కరెక్ట్

ఎ) జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ సూచనలతో స్వతంత్ర్య అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా వేయకుండా యధావిధిగా నిర్వహిస్తున్నారు
బి) 1996 నుంచి ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను నియమిస్తోంది
సి) ఎన్నికల్లో EVM లను ఉపయోగించాలని సూచించింది దినేష్ గోస్వామి కమిటీ
డి) ఎన్నికల్లో డిపాజిట్లు పెట్టడం ద్వారా ఆషామాషీ అభ్యర్థుల్ని తగ్గించవచ్చని సూచించింది జీవన్ రెడ్డి కమిషన్

 

నోట్:

ప్రస్తుతం లోక్ సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో మేం ఈ టెస్టును ఇస్తున్నాం. మేం తయారు చేసిన SI/PC (MAINS)/ GR.I,II, III మాక్ టెస్టులకు సంబంధించిన మోడల్స్ లో ఇది ఒకటి.  నమూనా కోసం మీకు ఉచితంగా అందిస్తున్నాం.  325 మాక్ టెస్టుల వివరాల కోసం ఈ కింది క్లిక్ చేయండి.

తెలంగాణ కోసం:

http://telanganaexams.com/mains-tests/

ఆంధ్రప్రదేశ్ కోసం

https://andhraexams.com/common-tests/